1 Samuel 10:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచిమీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్దభములను వెదకబోతివిు; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సౌలు తన సేవకుని కలిసి ఇంటికి వెళ్లగానే అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు” అని వారిని అడిగాడు. “గాడిదలను వెదకటానికి వెళ్లాము. అవి దొరకక పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” అని సౌలు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి–మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు —గార్దభములను వెదకబోతిమి; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సౌలు చిన్నాన్న అతన్ని అతని సేవకుడిని చూసి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు. అందుకతడు, “గాడిదలను వెదకడానికి వెళ్లాం, అవి కనబడలేదని సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్లాం” అని చెప్పాడు.