1 Samuel 11:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారుమేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయిన యెడల మమ్మును మేము నీకప్పగించుకొనెద మనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు–మేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయినయెడల మమ్మును మేము నీకప్పగించుకొనెదమనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.