1 Samuel 12:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతట సమూయేలు జనులతో ఇట్లనెనుభయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వకంగా యెహోవాకు సేవ చేయండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట సమూయేలు జనులతో ఇట్లనెను— భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు సమూయేలు ప్రజలతో, “భయపడకండి, మీరు ఈ చెడు చేశారనేది నిజమే కాని యెహోవాను విడిచిపెట్టకుండా మీ పూర్ణహృదయంతో యెహోవాను సేవించండి.