1 Samuel 12:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడుసాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు–అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడు–సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు సమూయేలు వారితో, “అటువంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ రోజు మీమీద సాక్షులుగా ఉన్నారు” అన్నాడు. “యెహోవాయే సాక్షి” అని వారు జవాబిచ్చారు.