1 Samuel 2:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవాతో వాదించువారు నాశనమగుదురుపరమండలములోనుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించునులోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు! యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు. “ఆయన తన రాజుకు బలాన్నిస్తారు తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.”