1 Samuel 2:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునివారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రజల విషయంలో యాజకులు చేస్తూ వచ్చిన పని ఏంటంటే, ఎవరైనా బలి అర్పిస్తే, దాని మాంసం ఉడుకుతుండగా యాజకుని సేవకులు మూడు ముళ్ళ కొంకి గరిటెను తీసుకువచ్చి,