1 Samuel 2:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజ కుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో— యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే క్రొవ్వును దహించకముందే యాజకుని సేవకుడు వచ్చి బలి అర్పించిన వారితో, “యాజకునికి కాల్చడానికి కొంత మాంసం ఇవ్వు; ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి” అని చెప్పేవాడు.