1 Samuel 2:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు. అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవావారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు ఆ అపరాధికి మధ్యవర్తిత్వం చేయవచ్చు; గాని ఎవరైనా యెహోవాకే వ్యతిరేకంగా పాపం చేస్తే వారి కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు?” అన్నాడు. అయితే వారిని చంపడం యెహోవా చిత్తం, కాబట్టి వారు తమ తండ్రి గద్దింపు వినలేదు.