1 Samuel 20:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు యోనాతానుఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు యోనాతాను–ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత యోనాతాను దావీదుతో, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సాక్షి, రేపుగాని ఎల్లుండి గాని ఈ సమయానికి నా తండ్రిని కలుసుకుంటాను. అతడు నీ పట్ల సానుకూలంగా ఉంటే ఆ విషయాన్ని నీకు తెలియచేయకుండా ఉంటానా?