1 Samuel 20:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలునిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాక పోవుట ఏమని యోనాతాను నడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవదినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు— నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే అమావాస్య తర్వాతి రోజు అనగా నెలలో రెండవ రోజున దావీదు చోటు ఖాళీగా ఉండడం చూసి సౌలు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని యోనాతానును అడిగాడు.