1 Samuel 20:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారునీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతి మాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారు–నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లయొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘దయచేసి నన్ను వెళ్లనివ్వు, నా పట్టణంలో మా వంశస్థులు బలి ఇవ్వబోతున్నారు కాబట్టి నేను కూడా అక్కడ ఉండాలని నా అన్న నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నాపై దయచూపించి నేను వెళ్లి నా అన్నలను కలుసుకునేలా నన్ను వెళ్లనివ్వు’ అని నన్ను అడిగి వెళ్లాడు. ఆ కారణంగానే అతడు రాజు బల్ల దగ్గరకు రాలేదు” అని చెప్పాడు.