1 Samuel 20:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండిన యెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవి చేయగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవిచేయగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు.