1 Samuel 21:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పిచ్చిచేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా? అని తన సేవకులతో అనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పటికే నా వద్ద పిచ్చి వాళ్లు చాలామంది ఉన్నారు. నా ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటానికి వీనిని మీరు నా ఇంటికి తీసుకుని రానక్కర్లేదు! ఈ మనిషిని మళ్లీ నా ఇంటికి రానివ్వకండి” అని తన అధికారులతో చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పిచ్చిచేష్టలుచేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రా తగునా? అని తన సేవకులతో అనెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పిచ్చి చేష్టలు చేసేవానితో నాకేమి పని? నా ఎదుట పిచ్చి చేష్టలు చేయడానికి ఇతన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఇలాంటివాడు నా ఇంట్లోకి రావాలా?” అన్నాడు.