1 Samuel 25:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతట దావీదు వారితోమీరందరు మీ కత్తులను ధరించుకొను డనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందల మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట దావీదు వారితో–మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందలమంది సామాను దగ్గర నిలిచిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు దావీదు వారితో, “మీరందరు మీ ఖడ్గాలు ధరించుకోండి” అని చెప్పగా వారు తమ ఖడ్గాలు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు నాలుగువందలమంది పురుషులు వెళ్లగా రెండువందలమంది సామాగ్రితో ఉండిపోయారు.