1 Samuel 25:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతకుమునుపు దావీదునాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతకుమునుపు దావీదు–నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతకుముందే దావీదు, “నాబాలు ఆస్తులలో ఏది అతడు పోగొట్టుకోకూడదని ఈ అరణ్యంలో నేను కష్టపడి కాపలా ఉన్నదంతా వృధానే కదా! నేను అతనికి మేలు చేస్తే అతడు నాకు కీడు చేశాడు.