1 Samuel 26:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారు డైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండుక్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత దావీదు బయలుదేరి సౌలు బసచేసిన చోటికి వెళ్లి, సౌలు, సేనాధిపతియైన నేరు కుమారుడు అబ్నేరు ఎక్కడ పడుకున్నారో చూశాడు. సౌలు శిబిరం లోపల పడుకున్నాడు, సైన్యమంతా అతని చుట్టూ ఉంది.