1 Samuel 27:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.” ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు ఇలా చేస్తున్నాడని తమ గురించి సమాచారం అందిస్తారని భావించిన దావీదు గాతుకు తీసుకురావడానికి పురుషులను గాని స్త్రీలను గాని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అలాగే చేస్తూ ఉన్నాడు.