1 Samuel 28:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో... యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధము నకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచినేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆకీషు దావీదుతో, “నీవూ, నీ మనుష్యులూ నాతో కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని గ్రహించావా?” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి–నేను దండెత్తగా నీవును నీ జనులును నాతోకూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని తమ సైన్యాలను సమకూర్చుకున్నారు. ఆకీషు దావీదుతో, “నీవు, నీ మనుష్యులు నాతో పాటు యుద్ధానికి రావాలని నీవు గ్రహించాలి” అన్నాడు.