1 Samuel 30:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కిపారి పోయిన నాలుగువందల మంది ¸°వనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు సాయంత్రం మొదలుపెట్టి మరునాటి సాయంత్రం వరకు వారిని చంపుతూ ఉంటే, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యువకులు తప్ప మరియెవరూ తప్పించుకోలేకపోయారు.