1 Samuel 30:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అలసటచేత దావీ దును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీ దును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలు దేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందలమందియొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలసిపోయి దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన ఆ రెండువందలమంది దగ్గరకు దావీదు రాగా వారు దావీదును అతనితో ఉన్న మనుష్యులను కలుసుకోడానికి వచ్చారు. దావీదు వారి దగ్గరకు వచ్చి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు.