1 Samuel 8:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గనుక యెహోవానీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలుమీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు. అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గనుక యెహోవా–నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలు–మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యెహోవా, “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అన్నారు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీరందరూ మీ సొంత పట్టణాలకు వెళ్లండి” అని చెప్పాడు.