1 Samuel 9:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లకమునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు భోజనం చేయడానికి ఉన్నత స్థలానికి వెళ్లకముందే మీరు పట్టణంలోకి వెళ్లండి. అతడు వచ్చేవరకు ప్రజలు తినరు. అతడు బలిని దీవించిన తర్వాత ఆహ్వానించబడిన వారు తింటారు. మీరు ఇప్పుడే పైకి వెళ్లండి; ఈపాటికి మీరు అతన్ని కలుసుకోవల్సింది” అన్నారు.