1 Samuel 9:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెనుచూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచ బడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడభోజనముచేసెను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వంటవాడు తొడ మాంసాన్ని తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పచనకర్త జబ్బను దాని మీద నున్నదానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను–చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతోకూడ భోజనముచేసెను,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వంటమనిషి మాంసంతో ఉన్న తొడను తెచ్చి సౌలు ముందు పెట్టాడు. అప్పుడు సమూయేలు సౌలుతో, “ఇదిగో నీకోసం దాచిపెట్టింది, ఇది తిను ఎందుకంటే ‘నేను అతిథులను ఆహ్వానించాను’ అని వంటమనిషితో చెప్పి దీన్ని నీ కోసం తీసి ఉంచమన్నాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.