1 Samuel 9:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కన బడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కోలేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరిగాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు వెళ్లి ఎఫ్రాయిం కొండ ప్రాంతమంతా తిరిగి షాలిషా దేశమంతా వెదికాడు కాని అవి కనబడలేదు. తర్వాత వారు షయలీము దేశం దాటి వెదికినా ఆ గాడిదలు దొరకలేదు. బెన్యామీనీయుల ప్రాంతంలో తిరిగి చూశారు కాని అవి దొరకలేదు.