1 Samuel 9:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వాడుఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ అతను చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాడు–ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒక డున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.