1 Samuel 9:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు సౌలుమనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరి పోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసి కొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పిమనయొద్ద ఏమి యున్నదని అడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు సౌలు —మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొనిపోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పి— మనయొద్ద ఏమి యున్నదని అడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు సౌలు, “ఒకవేళ మనం అతని దగ్గరకు వెళ్తే అతనికి మనం ఏమివ్వగలం? మన సంచుల్లో ఉన్న ఆహారమంతా అయిపోయింది. ఆ దైవజనునికి కానుకగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు. మరెలా?” అని సేవకుడిని అడిగాడు.