2 Chronicles 19:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు,ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవాదృష్టికి ఏ అప రాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హత్యావిషయాలు, చట్టపరమైన, ఆజ్ఞాపరమైన నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ సోదరుల వద్ద నుండి ఈ విషయాలు మీ తీర్పుకు వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పనిచేయని ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు వుండదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నరహత్యనుగూర్చియు, ధర్మశాస్త్రమునుగూర్చియు, ధర్మమునుగూర్చియు, కట్టడలనుగూర్చియు, న్యాయవిధులనుగూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమ ర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లువారు యెహోవాదృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.