2 Chronicles 21:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేక ములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోషాపాతు తన కుమారులకు వెండి బంగారు వస్తువులు, తదితర విలువైన కానుకలు యిచ్చాడు అతడు యూదాలో బలమైన కోటలు నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు పెద్ద కుమారుడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేకములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి తండ్రి వారికి అనేక వెండి, బంగారం విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చాడు, వాటితో పాటు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము తనకు ప్రథమ పుత్రుడు, కాబట్టి అతనికి రాజ్యం ఇచ్చాడు.