2 Chronicles 22:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారుకులైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారకులైరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అహాబు కుటుంబంలా అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఎందుకంటే అతని తండ్రి చనిపోయిన తర్వాత వారు అతనికి సలహాదారులయ్యారు. ఇది అతని పతనానికి కారణమైంది.