2 Chronicles 26:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఉజ్జియా తన పితరులతో కూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధ మైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఉజ్జియా చనిపోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా సమాధిచేశారు. ఉజ్జియా కుష్ఠురోగి కావటంవల్ల రాజుల శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉజ్జియా తన పితరులతోకూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉజ్జియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, రాజులకు చెందిన స్మశానవాటికలో వారి సమీపంలో పాతిపెట్టబడ్డాడు, ఎందుకంటే, “అతనికి కుష్ఠువ్యాధి ఉంది” అని ప్రజలు అన్నారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.