2 Chronicles 28:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇదియు గాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారుల నేమి కుమార్తెల నేమి రెండు లక్షల మందిని చెరతీసికొని పోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న తమ బంధువులైన రెండు లక్షల మందిని బందీచేశారు. వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువైన వస్తువులను పట్టుకుపోయారు. ఇశ్రాయేలీయులు ఆ బందీలను, వస్తువులను సమరయకు (షోమ్రోను) తీసుకొనిపోయారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదియుగాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షలమందిని చెరతీసికొనిపోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్రాయేలీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల నుండి రెండు లక్షలమంది భార్యలను, కుమారులను, కుమార్తెలను యూదా నుండి బందీలుగా తీసుకున్నారు. వారు గొప్ప దోపుడుసొమ్మును దోచుకుని తిరిగి సమరయకు తీసుకెళ్లారు.