2 Chronicles 31:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవ భాగములను ప్రతి ష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయు డైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింపబడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తరువాత యాజకులు కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో యెహోవాకై ప్రత్యేకించబడిన కానుకను తెచ్చారు. అలా సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో భద్రపర్చారు. లేవీయుడైన కొనన్యా వీటిపై పర్యవేక్షకుడుగా నియపింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు.