2 Chronicles 6:41 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము. నీ యాజకులు రక్షణ పొందుదురు గాక! ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెహోవా దేవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. యెహోవా దేవా! మీ యాజకులు రక్షణను ధరించుకొందురు గాక! మీ మంచితనాన్నిబట్టి నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషించుదురు గాక!