2 Corinthians 10:16 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దైవసందేశాన్ని మీ ప్రాంతంలోనే కాక, మీకు ముందున్న ప్రాంతాల్లో కూడా ప్రకటించాలని మా ఉద్దేశం. ఇతరులు తమ ప్రాంతాల్లో యిదివరకే చేసిన కార్యాల్ని గురించి మేము గొప్పలు చెప్పుకోవాలని మాకు లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరి యొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఈ సువార్తను బోధించగలము. కాబట్టి వేరొకరి ప్రాంతంలో ఇంతకుముందే జరిగిన పని గురించి మేము పొగడుకోవాలని కోరడంలేదు.