2 Corinthians 13:11 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధాన ములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై యుండును.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చివరికి, సోదరీ సోదరులారా, ఆనందించండి! పునరుద్ధరణ కోసం పాటు పడండి. ప్రోత్సాహం పొందండి. ఏక మనసుతో ఉండండి. శాంతితో జీవించండి. ప్రేమ, సమాధానాల దేవుడు మీతో ఉంటాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చివరిగా సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. సమాధానం కలిగి జీవించండి. ప్రేమ సమాధానాలకు కర్తయైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.