2 Corinthians 8:10 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్స రము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళలో మీరే ప్రథములు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇందునుగూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటివారై యుండిన మీకు మేలు౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ విషయంలో మీకు ఏది మంచిదో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. గత ఏడాది మీరు ఇవ్వడంలోనే కాదు అలా చేయాలనే ఆసక్తిలో కూడా మొదటివారిగా ఉన్నారు.