2 Corinthians 8:24 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశ యము వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి వారికి మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాల్లో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పామో వారికి రుజువు చేయండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందువల్ల వారికి మీ ప్రేమను చూపించండి, మీ గురించి మేము ఎందుకు గర్విస్తున్నామో చూపించండి. అప్పుడు సంఘాలు కూడా తెలుసుకోగలవు.