2 Kings 13:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అను గ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థాన ములలో కాపురముండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల ఇశ్రాయేలుని కాపాడేందుకు ఒక వ్యక్తిని యెహోవా పంపాడు. ఇశ్రాయేలువారు సిరియావారి నుండి విడిపింపబడ్డారు. అందువల్ల ఇశ్రాయేలువారు పూర్వం చేసినట్లుగా, తమ ఇళ్లకు పోయారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొనిమునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా ఇశ్రాయేలుకు ఒక రక్షకుని ప్రసాదించారు, అతని ద్వారా వారు అరాము అధికారం నుండి తప్పించుకున్నారు. కాబట్టి మునుపటిలా ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళలో నివసించారు.