2 Kings 15:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబది మందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పెకహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు రెమల్యా కుమారుడు. పెకహు రాజైన పెకహ్యాకు విరోధముగా పన్నాగము చేశాడు. అతనిని షోమ్రోనులోని రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి వచ్చిన 50 మంది మనుష్యులు పెకహ్యాని చంపేటప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత పెకహు క్రొత్తగా రాజయ్యాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబదిమందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులో నున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.