2 Kings 17:41 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయ భక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయు చున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహోవాను గౌరవిస్తారు. అలాగే తమ సొంత విగ్రహాలను కూడా పూజిస్తారు. తమ పూర్వికులు చేసినట్లుగానే, వారి పిల్లలు మనుములు, మనుమరాండ్రు అవే పనులు చేస్తున్నారు. ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమపితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్ననూ, విగ్రహాలను కూడా సేవించారు. ఈనాటికీ వారి పిల్లలు, పిల్లల పిల్లలు వారి పూర్వికులు చేసినట్టే చేస్తున్నారు.