2 Kings 18:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సర మందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారు డగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఏడవ సంవత్సరములో ఇది జరిగింది).
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్టణముమీదికి వచ్చి ముట్టడివేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు.