2 Kings 19:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా చెప్పేదేమనగా: ‘అతడీ నగరంలోకి రాడు. అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు. అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు. నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.