2 Kings 2:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకతడునీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడి నప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు ఏలీయా, “నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు” అని చెప్పాడు.