2 Kings 2:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టిఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి–ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎలీషా ఏలీయా మీద నుండి క్రిందపడ్డ పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీళ్లను కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్నాడు. అతడు ఆ నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు కుడి వైపుకు ఎడమవైపుకు విడిపోగా అతడు అవతలి ఒడ్డుకు వెళ్లాడు.