2 Kings 2:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చిబోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎలీషా ఆ నగరం నుండి బేతేలుకు వెళ్లాడు. ఎలీషా నగరం చేరడానికి కొండ ఎక్కుతూ ఉన్నాడు. నగరం నుండి కొందరు పిల్లలు బయటకి వస్తున్నారు. ఎలీషాని చూచి, వారు ఎగతాళి చేశారు. అతనితో వారు ఇట్లు అన్నారు: “ఓ బట్టతల మనిషీ, పైకి వెళ్లుము.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి —బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యముచేయగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడినుండి ఎలీషా బేతేలుకు వెళ్లాడు. అతడు దారిన వెళ్తుండగా పట్టణంలో నుండి కొంతమంది బాలురు వచ్చి, “బోడివాడా, ఇక్కడినుండి వెళ్లిపో! బోడివాడా, ఇక్కడినుండి వెళ్లిపో!” అంటూ అతని గేలి చేశారు.