2 Kings 23:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవామందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు యెహోవా మందిరం నుండి యెరూషలేము బయట ఉన్న కిద్రోను లోయ దగ్గరకు అషేరా స్తంభాన్ని తెప్పించి, అక్కడ దానిని కాల్చివేశాడు. అతడు దానిని పొడిగా నలుగగొట్టి ఆ పొడిని సాధారణ ప్రజల సమాధుల మీద చల్లాడు.