2 Kings 25:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులంద రును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పాపట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు కారేహకు కుమారుడైన నెటోఫాతుకు చెందిన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మాయాకాతు కుమారుడైన యజన్నా మొదలయిన వారు సైన్యాధిపతులు. ఈ సైన్యాధిపతులు, వారి మనుష్యులు, బబులోను రాజు గెదల్యాను అధిపతిగా చేసినట్లు విన్నారు. అందువల్ల గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్పాకి వెళ్లారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పాపట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడి రాగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బబులోను రాజు గెదల్యాను అధికారిగా నియమించాడని సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విని, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారుడైన యోహానాను, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మయకాతీయుని కుమారుడైన యాజన్యా వారి మనుష్యులు వచ్చారు.