2 Kings 4:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషామరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండు నని ఆమెతో అనెను. ఆమె ఆ మాట వినిదైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు. ఆ స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎలీషా —మరుసటియేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని–దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాల నైన నాతో అబద్ధమాడవద్దనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు. అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.