2 Kings 4:31 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను గాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కన బడలేదు గనుక వాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎలీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. ఆ బిడ్డ ముఖము మీద ఆ కర్రను ఉంచాడు. కాని బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవడానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవలేదు” అని గేహజీ ఎలీషాకి చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెనుగాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి — బాలుడు మేలుకొనలేదని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గేహజీ వారికంటే ముందే వెళ్లి బాలుని ముఖం మీద ఆ దండం ఉంచాడు, అయితే ఏ శబ్దం కాని స్పందన కాని లేదు. కాబట్టి గేహజీ ఎలీషాను కలుసుకోడానికి వెళ్లి అతనితో, “బాలుడు మేలుకోలేదు” అని చెప్పాడు.