2 Kings 4:41 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడుపిండి కొంత తెమ్మనెను. వారు తేగాకుండలో దాని వేసి, జనులు భోజనము చేయు టకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. దాన్ని అతను కుండలో వేసి. “మనుష్యులకు ఆ కూర వడ్డించండి. వారు భుజిస్తారు” అని ఎలీషా చెప్పాడు. ఆ కూరలో ఎలాంటి దోషం లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు–పిండి కొంత తెమ్మనెను. వారు తేగా–కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగాకుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎలీషా, “పిండి కొంచెం తీసుకురండి” అన్నాడు. అతడు పిండిని కుండలో వేసి, “ప్రజలు తినడానికి దానిని వారికి వడ్డించండి” అన్నాడు. అప్పుడు కుండలో హానికరమైనదేది లేదు.